రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీపావళి సందర్బంగా ఈ నెల 10న రిలీజ్ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య మీడియాతో మాట్లాడారు.
‘కార్తీక్ సుబ్బరాజ్‌పై నమ్మకంతో ఈ సినిమాను చేయటానికి రెడీ అయ్యాం. ‘జిగర్ తండ” సినిమానే నేను చేయాల్సింది. కానీ మిస్ అయ్యింది. దాంతో రెండో పార్ట్‌లో నటిద్దామని నేనే కార్తీక్ సుబ్బరాజ్‌ని అప్రోచ్ అయ్యాను. ఇదొక పీరియాడిక్ మూవీ. మంచి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. సినిమాలో యాక్షన్ పార్ట్‌తో పాటు సెకండాఫ్‌లో మంచి ఎమోషనల్ కంటెంట్‌తో కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసిన రాఘవ లారెన్స్‌ను కాకుండా కొత్త లారెన్స్‌ను చూస్తారు. త్వరలోనే ముని 5, కాంచన 4 మొదలు పెడుతున్నాను. రజినీకాంత్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను. అన్నీ కరెక్ట్‌గా కుదిరితే మేకర్స్ చెబుతారు’.
– రాఘవ లారెన్స్
‘ఈ సినిమాను వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించారు ప్రొడ్యూసర్ కార్తికేయన్. జిగర్ తండ సక్సెస్‌ఫుల్ సినిమా కావటంతో జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయని తెలుసు. అయితే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం. లారెన్స్ గ్యాంగ్‌స్టర్.. నేనేమో డైరెక్టర్ కావాలనుకుని యాక్ట్ చేసే వ్యక్తి. మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది’.
– ఎస్.జె.సూర్య