అంచనాలకు మించి..

Beyond expectations..అల్లుఅర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2..ది రూల్‌’. డిసెంబర్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చెన్నైలో సాయి రామ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్‌ స్టేడియం ఆవరణలో వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌తోపాటు అల్లుఅర్జున్‌తో శ్రీలీల చేసిన స్పెషల్‌ సాంగ్‌ ‘కిస్సింగ్‌’ను లాంచ్‌ చేశారు.అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, ‘చెన్నైతో నాకు ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉంది. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటున్నారా, ఫైర్‌ అనుకుంటున్నారా, వైల్డ్‌ ఫైర్‌’. ఇలాంటి సినిమాని చేసిన మైత్రి మూవీస్‌ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏజిఎస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ తమిళనాడులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. నా జీవితంలో బాగా ఇంపాక్ట్‌ కలిగించిన ఒకే ఒక్క మనిషి పేరు చెప్పాలి అంటే అది కచ్చితంగా సుకుమార్‌ మాత్రమే. అభిమానుల అందరి అంచనాలను డిసెంబర్‌ 5వ తేదీన రీచ్‌ అవుతాం అనుకుంటున్నాను’ అని తెలిపారు.