‘నాయకుడు’ వంటి ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. 37 సంవత్సరాల తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు మరింత ఎగ్జైట్‌మెంట్‌ని యాడ్ చేస్తూ మేకర్స్ ఈ సినిమాలో శింబు నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ టీజర్‌ను విడుదల చేశారు. అది సినిమాపై క్యురీయాసిటీని మరింత పెంచింది. ఇది విజువల్ ఫీస్ట్‌గా ఉంది. బ్రెత్ టేకింగ్ విజువల్స్, యాక్షన్ షాట్‌లు గ్రేట్ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌ని చూపించబోతున్నాయి. టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది. త్రిష కష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లేఖి, అభిరామి, నాజర్, జోజు జార్జ్ లాంటి ప్రముఖ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ విజువల్ వండర్‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.