డ్యాన్స్ లవర్స్‌ను మెస్మరైజ్ చేసిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్1’కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2′- వైల్డ్ ఫైర్’ ఈనెల14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.ఈ షోకు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2- వైల్డ్ ఫైర్’ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ గురించి ఓంకార్ మాట్లాడుతూ,’ఈ షో మీకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్‌ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్‌ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇలాంటి షో చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్’ అని తెలిపారు. ”డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1′ టైమ్‌లో కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు దీనికి హోస్ట్‌గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఓంకార్, శేఖర్ మాస్టర్‌తో కలిసి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది’ అని నాయిక ఫరియా అబ్దుల్లా చెప్పారు. హోస్ట్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, ”డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ను పెద్ద సక్సెస్ చేశారు. ఇప్పుడు ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ మీ ముందుకు వస్తోంది. ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది. ఆహాలో ఈ నెల 14 తేదీ రాత్రి 7 గంటల నుంచి అదిరిపోయే పర్‌ఫార్మెన్స్‌ల కోసం చూడండి’ అని అన్నారు. మెంటార్ యష్ మాస్టర్ మాట్లాడుతూ, ‘ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క ఆడియెన్‌ను ఆకట్టుకుంటుంది. ఆహాను సబ్‌స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే చేసుకుని మా షోను చూడండి. ఈనెల 14 నుంచి మిమ్మల్ని ఈ షో ఎంటర్‌టైన్ చేయబోతోంది. ఇలాంటి షోలో నేను మెంటార్‌గా ఉండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.