హీరో నితిన్ నటించిన కొత్త సినిమా ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. నితిన్, వెంకీ కుడుమల కాంబినేషన్‌లో విడుదలైన చిత్రం ‘భీష్మ’. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా విశేష ఆదరణ పొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇదే కాంబోలో రూపొందిన ‘రాబిన్‌హుడ్’పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇప్పటివరకు విడుదలైన ఈచిత్ర టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందరి అంచనాలకు మించి ట్రైలర్ ఉండబోతోందని దర్శకుడు వెంకీ కుడుమల ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. అలాగే తాను, వెంకీ కలిసి చేస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇదని, ‘భీష్మ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నట్లు హీరో నితిన్ అన్నారు. శ్రీలీలతో కూడా తనది సెకండ్ ఫిల్మ్ అని, ఈ సినిమాతో తమ పెయిర్ హిట్ పెయిర్ అనిపించుకుంటుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.