ఆ అంచనాలకు మించి..

Beyond those expectations..నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్లు బ్లాక్‌ బస్టర్‌ నోట్‌లో  ప్రారంభమయ్యాయి. ఫస్ట్‌ సింగిల్‌ ‘బుజ్జి తల్లి’ సెన్సేషనల్‌ హిట్‌ అయింది. రీసెంట్‌గా రిలీజైన సెకండ్‌ సింగిల్‌ ‘నమో నమః శివాయ’ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మంగళవారం థర్డ్‌ సింగిల్‌ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ‘తండేల్‌’ థర్డ్‌ సింగిల్‌ బ్లాక్‌ బస్టర్‌ లవ్‌ సాంగ్‌ ‘హైలెస్సో హైలెస్సా..’ ఈనెల 23న రిలీజ్‌ కానుంది. సముద్ర తీరంలో రగ్డ్‌  లుక్‌లో లవ్లీ స్మైల్‌తో నిలుచుకున్న నాగచైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్‌గా డ్యాన్స్‌ చేస్తూ సాయి పల్లవి కనిపించిన సాంగ్‌ అనౌన్స్మెంట్‌ పోస్టర్‌ అందర్నీ అలరిస్తోంది. ప్రస్తుతం ఈ  పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.’లవ్‌స్టోరీ’ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో  రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే దర్శకుడు చందు మొండేటి ‘కార్తీకేయ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాని ఇచ్చారు. దీంతో  ఈసినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. వీటికితోడు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు.. హ్యూజ్‌ బజ్‌ క్రియేట్‌ చేశాయి. భిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమా కచ్చితంగా అందరి అంచనాలకు మించి ఉంటుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి పోషించిన పాత్రల గురించి,  వారి నటన గురించి, దర్శకుడు చందు టేకింగ్‌ గురించి ప్రేక్షకులు కచ్చితంగా మాట్లాడుకుంటారని మేకర్స్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: చందూ మొండేటి, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌, డీవోపీ: షామ్‌దత్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: శ్రీనాగేంద్ర తంగాల.