– రెండో స్థానంలో మహబూబాబాద్ :మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు పట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణీత గడువును ప్రకటించటం హర్షణీయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ జిల్లాలో 1,51,197 ఎకరాలకు గానూ 50,595 మందికి పట్టాలు అందించనున్నామని వివరించారు. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్ చేతుల మీదుగా అక్కడ పట్టాల పంపిణీ కొనసాగుందని తెలిపారు. అత్యధిక పోడు ఉన్న జాబితాలో మహబూబాబాద్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆ జిల్లాలో మొత్తం 67,730 ఎకరాలకు గానూ 24,181 మందికి పట్టాలు అందించనున్నట్టు తెలిపారు. తనతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ హజరై రైతులకు పట్టాలు అంజేస్తామని వివరించారు.