భాగ్‌ సాలే రిలీజ్‌కి రెడీ

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్‌ సాలే’. నేహా సోలంకి నాయికగా కనిపించ నుంది. ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించారు. జూలై 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్‌ను చిత్రబందం వెల్లడించింది. ‘వరల్డ్‌ ఆఫ్‌ భాగ్‌ సాలే’ను ప్రేక్షకులకు హీరో సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేయ బోతున్నారు. ఆయన వాయిస్‌ ఓవర్‌తో ఈ చిత్ర నేపథ్యాన్ని వివరించ బోతున్నారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్‌ చేస్తున్నాడు?, దాని వెనకున్న కారణాలు సిద్ధు వాయిస్‌లో ఆసక్తికరంగా చెప్పబోతున్నాడు. భాగ్‌ సాలే ప్రపంచం ఎలా ఉండనుంది అనేది జూలై 7న థియేటర్స్‌లో చూడాలని మూవీ టీమ్‌ కోరుతున్నారు. రాజీవ్‌ కనకాల, జాన్‌ విజరు, వర్షిణి సౌందరాజన్‌, నందిని రారు, వైవా హర్ష, సత్య, సుదర్శన్‌, ప్రిథ్వీ రాజ్‌, ఆర్‌ జె హేమంత్‌, బిందు చంద్రమౌళి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఛాయాగ్రహణం : రమేష్‌ కుషేందర్‌, సంగీతం : కాల భైరవ, ఎడిటర్‌ : ఆర్‌.కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జే పి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : శతి నూకల, ఫైట్‌ మాస్టర్‌ : రమ కష్ణ, కొరియోగ్రాఫర్‌ : భాను, విజరు పోలకి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : అశ్వత్థామ, గిఫ్ట్సన్‌ కొరబండి.