జయవీర్ మనవాడు.. భగత్ పరాయి వాడు..!

నవతెలంగాణ -పెద్దవూర: జయవీర్ మనవాడు, నోముల భగత్ పరాయి వాడు, మనవాడిని మనం గెలిపించు కుంటే సాగర్ అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుందని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్న కూతురు, తెలంగాణ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యారావు అన్నారు. శనివారం నల్గొండజిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. జానారెడ్డి గెలిస్తే ఎలా నాగార్జునసాగర్ ను అభివృద్ధి చేశాడో, జైవీర్ కూడా అంతకన్నా ఎక్కువ అభివృది చేస్తాడని కొనియాడారు. పరాయి వాడు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా, మనవాడు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా, ఆలోచించండి అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోష్ తీసుకొచ్చారు. ప్రచారం లో కేసీఆర్ అన్న కూతురు పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజ వచ్చింది. నాగార్జున సాగర్ నియోజక వర్గంలో లో గులాబీ పార్టీ వారు ఏమి అభివృద్ధి చేయలేదుని, సీనియర్ నాయకుడు జానా రెడ్డినీ విమర్శించే స్థాయి లేని భగత్ ను ఈ ఎన్నికల్లో పారద్రోలి, కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టాలన్నారు. నాగార్జున సాగర్ లో జానా రెడ్డిచేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేదు అని జానారెడ్డి నీ విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదుని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓట్ల కోసం వస్తే అసలు ఊర్లోకి రాకుండా తరిమి వేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీది గుండాయిజం అని గులాబీ పార్టీ వాళ్ళను నమ్మవద్దని హితవు పలికారు. హైదరాబాదు నుండి జై వీర్ గెలుపు కోసం వచ్చాను మన ఇంటి బిడ్డ జైవీర్ ను గెలిపించాలని కోరారు. తమ్ముడు జై వీర్ అందర్నీ ఆదు కుంటాడు, పింకు పార్టీ వాళ్ళను నమ్మ వద్దుని బరిగలు పట్టుకుని పారద్రోలి తిరిగి రాకుండా చేయాలన్నారు. గులాబీ పార్టీ వాళ్ళది గుండా యిజమని, సాగర్ నోముల భగత్ ఏమి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంతా గుండు సున్నాయే అని ధ్వజ మెత్తారు. ఈ కార్యక్రమంలో లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవిర్ రెడ్డి, పిసిసి సభ్యులు కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు బీరెడ్డి బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తోడిమ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.