భగత్ ఉద్యమస్ఫూర్తితో నూతన విద్యా విధానం 2020 రద్దుకై పోరాడాలి..

– తే.యూ పీ.డీ.ఎస్.యూ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నూతన విద్యా విధానం 2020  రద్దుకై  పోరాడాలని తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ  ప్రధాన కార్యదర్శి జయంతి యూనివర్సిటీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.భగత్ సింగ్ 93 వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి యూనివర్సిటీ విద్యార్థులకు ఆదర్శం కావాలని, కేంద్ర ప్రభుత్వం విద్యను మొత్తం కాషాయికరించే కుట్రలో భాగంగానే నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చారని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సిలబస్ లో స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తొలగించారని, అదేవిధంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలను తొలగించి అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను పుస్తకాలలో చేరుస్తున్నారని  అన్నారు.భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తే. యూ పి.డి.ఎస్. యూ నాయకులు రవీందర్,ఆకాష్, అనీల్ ,రాకేష్ , అఖీల్ ,ఆదిత్య, అశ్విత్ తదితరులు పాల్గొన్నారు.