
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ విద్యార్థి ఏ. రాకేష్ అన్నారు. శనివా రం మండల కేంద్రంలో విద్యార్థుల సమక్షంలో భగ త్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు చిత్ర పటా నికి పూలమాలేసి నివాళులర్పంచారు. అనం తరం ఏ. రాకేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశ స్వాతం త్రం కోసం పోరాడిన గొప్ప యువ నాయకుడు అని అన్నారు. విదేశీ బ్రిటీష్ వలస పాలన నుండి మన భారతదేశానికి విముక్తి కావాలని పేర్కొన్నారు. స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా 23 ఏళ్ల వయసులోనే ఉరి కంబాన్ని చిరునవ్వుతో ముద్దాడి ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకులని కోనియడారు. విదేశీ వలస పాలకుల నుండే కాకుండా దేశంలోని భూస్వాముల నుండి కూడా రైతాంగానికి విముక్తి కావాలని కోరుకున్న నాయకుడు భగత్ సింగ్ అని హర్షం వ్యక్తం చేశా రు. భగత్ సింగ్ సంపూర్ణంగా నాస్తికుడుగా జీవి స్తూ మూఢవిశ్వాసాలను వ్యతిరేకిస్తూ యువతను ప్రోత్సహిస్తూ చైతన్యపరచాడని గుర్తు చేశారు.
ప్రస్తుతం యువకులు భగత్ సింగ్ గారిని ఆదర్శం గా తీసుకొని తమ హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశ్నించే తత్వంగా యువత మేలుకోవాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాయి తేజ, రంజిత్, సాజన్, హుస్సేన్, ఈశ్వర్, నిరేష్, కార్తీక్ ,భాను, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.