నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ
8వ కాలనీలోని ఇందిరా నగర్ లో మంగళవారం మాణికేశ్వరి మాత ఆశ్రమ పూజారి మణికంఠ స్వామి నిర్వహణలో భగవద్గీత హోమం ఘనంగా నిర్వహించారు. ఈ హోమంలో దాదాపు 21 జంటలు పాల్గొని హోమం నిర్వహించారు. హామం అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వాహకులు దుగ్యాల మధుకర్ రావు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం ధర్మ సంస్థాపనే ద్యేయంగా మానవ జన్మ ముక్తి కొరకై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగునూరి రాజేంద్ర ప్రసాద్, రాణి, నగునురి సత్యనారాయణ లక్ష్మి, దుగ్యాల మధుకర్ రావు, లావణ్య, నగునూరి లక్ష్మి నారాయణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.