– ఒక్కో జిల్లాకు ఒక్కో విధానంపై ప్రశ్నించిన యూనియన్
– భారీగా కదిలిన కార్మికులు
– దిగొచ్చిన సర్కారు, కంపెనీలు
– 17 వేల మందికి ప్రయోజనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మిషన్ భగీరథ..బీఆర్‌ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు. రూ.45 వేల కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా ఊరూరా పైపులైన్, ఇంటింటికి తాగునీరు అందించడం దీని లక్ష్యం. ఇదంతా ఒక పార్శ్యం. మరోపార్శ్యం అందులో పనిచేస్తున్న కార్మికుల బతుకులు అవి దుర్భరం. జిల్లాకో విధానం, కంపెనీకో రూల్ అంటూ ఇష్టా రాజ్యంగా సాగింది. కనీస వేతనాలు కరువ య్యాయి. వేతనాల పెంపు కోసం నెలలతర బడి ఆందోళన చేయాల్సి వచ్చింది. ఇందుకు సీఐటీయూ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్’ భగీరథ ప్రయత్నమే చేసింది. ఈ పోరాటం సాధించిన విజయం ద్వారా ద్వారా 17 వేల మందికి ప్రయోజనం కలి గింది. పెరిగిన వేతనం కొంచమే అయినా ఐక్య పోరాటంతోనే ఈ వేతనాల పెంపు సాధ్యమైంది.
2016లో…
2016 ఆగస్టులో మిషన్ భగీరథ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 26 సెగ్మెంట్లల్లో ప్రధాన పనులు, ఇంట్రా నెట్‌వర్క్ పనులు చేపట్టింది. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంటు ప్లాంట్లు (డబ్ల్యూటీపీ) ఓహెచ్‌బీఆర్‌లు,జీఎల్‌బీఆర్‌లు మెయిన్ పైపులైనింగ్ తదితర నిర్మాణాలు చేసింది. ప్రధాన పనులన్నీ పెద్దపెద్ద కంపె నీలకు గ్లోబల్ టెండర్ల ద్వారా ఇచ్చింది. ఇంట్రా నెట్‌వర్క్ పనులను బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టగలిగిన వారికి కట్టబెట్టింది. దీంతో ఒక్కో జిల్లాలో ఒక్కో కంపెనీ పనులు చేపట్టింది.
రిక్రూట్‌మెంట్
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయా పనుల కోసం అవసరమైన సాంకేతిక నిపుణులు, సాధారణ కార్మికులను నేరుగా ప్రభుత్వం ద్వారా కాకుండా కంపెనీల ద్వారా నియ మించారు. సాధారణంగా ప్రభుత్వం కాంట్రా క్టు కార్మికులతో పనులు చేయిస్తుంది. ఈసారీ అలా కాకుండా పనులు దక్కించుకున్న కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగించింది. తద్వారా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న పంపు అపరేటర్లు, లైన్‌మెన్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ తదితర కార్మికులకు అన్యాయం జరిగింది. సంవత్సరాల తరబడి వేతనాల పెంపు జరగలేదు.
అందుకే సంఘం
భగీరథ ప్రాజెక్టులో చేసే ఆయా పనులకు వేలాది మంది అవసరమయ్యారు. ఆమేరకు ఆయా కంపెనీలు వీరిని సమకూర్చుకుని పనులు చేయించుకున్నారు. నేరుగా కార్మికు లకే వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, అలా కాకు ండా ప్రభుత్వం కంపెనీలకే చెల్లించింది. ప్రభుత్వం ఒక్కో కార్మికునికి ఆయా కంపె నీలకు రూ.18,400 చెల్లిస్తే, సదరు కంపెనీ లు ఆయా కార్మికులకు రూ. 9 నుంచి 10 వేలు మాత్రమే ఇచ్చాయి. దాదాపు 50 శాతం వేతనం కంపెనీల చేతుల్లోనే ఉండిపోయింది. 2022లో జారీ చేసిన జీవో 11 ప్రకారం వేత నాల చెల్లింపులు చేయలేదు. సర్కారు కనీస వేతనాల అమలును నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ భగీరథ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో కార్మికులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఉద్యమం..ఇద్దరి బలిదానం
సర్కారు, కంపెనీ విధానం మూలంగా నష్టపోయిన కార్మికులు సీఐటీయూ ఆధ్వ ర్యంలోని మిషన్ భగీరథ ఎంప్లాయిఎస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు రోడ ె్డక్కారు. ఒకే రకమైన వేతన పద్ధతిని నిరసిం చారు. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కనీసం వేతనం రూ.26 వేల ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. పీ ఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, సెలవులను చట ్టప్రకారం ఇవ్వాలని పోరాటం ద్వారా పట్టు బట్టారు. జిల్లాల వారీగా ధర్నాలకు దిగారు. రిలే నిరాహార దీక్షలకు పూను కున్నారు. పలు ఆందో ళన కార్యక్రమాలు నెల ల తరబడి చేశారు. నల్లగొండ, మహూబ ్‌నగర్, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో భారీ పోరాటాలే జరిగాయి. నెలల తరబడి ఆందో ళనలు కొనసాగాయి. ఈ పో రాటంలో నల్ల గొండ, వనపర్తి జిల్లాల్లో ఇద్దరు కార్మికులు బల య్యారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. ఈనేపథ్యంలో ప్రభుత్వ ంతోపాటు ప్రయివేటు కంపెనీల్లో కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరికీ రూ 500 నుంచి రూ. 1500 వేతనాలు పెంచి ంది. సీఐటీయూ నేతృ త్వరలో మిషన్ భగీరథ ఎంప్లాయిస్, వర్కర్లు సాధించిన విజయమిది .
పోరాటాల ఫలితమే వేతనాల పెంపు
మిషన్ భగీరథ ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం రూ. 500 నుంచి రూ. 1500 వేతనాలు పెంచింది. నల్లగొండలో నెల రోజులు, సంగారెడ్డిలో రెండు వారాలు, మహబూబ్‌నగర్‌లో 12 రోజులు ఆందోళన నడిచింది. దీంతో సర్కారు, కంపెనీలు దిగొచ్చాయి. కానీ పెంపు సరిపోదు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. చట్టం ప్రకారం చెల్లించాలి. విధుల నిర్వహణలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి రక్షణ చర్యలు ఉండాలి.
వంగూరి రాములు ప్రధాన కార్యదర్శి
తెలంగాణ మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్‌న