
మండలంలోని పోసానిపేట గ్రామ పరిధిలో శుక్రవారం గ్రామానికి సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అంతకుముందు కూడా ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ సిబ్బంది స్పందించి మరమ్మత్తు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ధ్వంసం చేసే వ్యక్తులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.