భాగ్యోదయం పుస్తకవిష్కరణ..

– భాగ్యరెడ్డివర్మ జీవితం ఆదర్శప్రాయం…
– టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి 
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ ఆదర్శప్రాయమని టీఎస్ పీఎస్సీ పూర్వ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హిందు పేర్కొన్నారు. ఆది సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో చాదర్ ఘాట్ లోని ఆదిహిందుభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డివర్మ జీవిత చరిత్రపై పునర్ ముద్రించిన దివంగత నేత ఎం.బి. గౌతమ్ రచించిన ‘భాగ్యోదయం’ పుస్తకాన్ని  ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి, స్త్రీ విద్యకు ఆయన ఎంతో కృషి చేశారని కీర్తించారు. ట్యాంక్బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అంతకుముందు ఆంధ్ర మహిళ సభ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కరుణాదేవి పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. లీగ్ కార్యదర్శి అజయ్ గౌతమ్, ప్రతినిధులు ఎం.బి.సుధాకర్, జ్ఞానప్రకాష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.