ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే ‘భైరవం’

'Bhairavam' will bring a new experience to the audience.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భైరవం’. విజరు కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌పై డాక్టర్‌ జయంతిలాల్‌ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్‌ నిర్మించారు. అదితి శంకర్‌, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను లాంచ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ,”భైరవం’ లాంటి మంచి కథ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ విజరు చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. నారా రోహిత్‌, మంచు మనోజ్‌తో వర్క్‌ చేసే అవకాశం రావడం ఒక బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి, మమ్మల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘ఇది జస్ట్‌ టీజర్‌ మాత్రమే. ట్రైలర్‌ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్‌ ఉంటాయని ఆశిస్తున్నాను’ హీరో మనోజ్‌ మంచు అన్నారు. హీరో నారా రోహిత్‌ మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక క్యారెక్టర్‌ ఇందులో చేశా. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది’ అని చెప్పారు. దర్శకుడు విజరు కనకమేడల మాట్లాడుతూ,’శ్రీ చరణ్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. ‘వెన్నెల..’ పాట బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా మాస్‌ యాక్షన్‌ ఆడియన్స్‌కి పండగలా ఉంటుంది. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతినిచ్చింది. నా ‘నాంది’ సినిమాని చూసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఫీల్‌ అయ్యారో, అలాగే ఈ సినిమా చూసినప్పుడు కూడా అలాగే ఫీల్‌ అవుతారు. ‘నాంది’ కంటే మంచి పేరు ఈ సినిమా తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాను’ అని తెలిపారు. ‘మా బ్యానర్‌ మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. దర్శకుడు విజరు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు’ అని నిర్మాత కేకే రాధా మోహన్‌ చెప్పారు.