
మద్నూర్ మండలంలోని రాష్ట్ర సరిహద్దులోని పూర్తిగా మహారాష్ట్ర బార్డర్ లో గల సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో గత 25 రోజులుగా భజన కీర్తన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం సందర్భంగా ఆలయ ఆవరణంలో నెలరోజుల పాటు భజన కీర్తన ప్రత్యేక పూజలు అన్నదానం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో నిర్వహించే అధికమాసాన్ని పురస్కరించుకొని రోజువారి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ముందుకు వచ్చి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజన కీర్తనలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.