కృష్ణాజివాడి గ్రామంలో భక్త మార్కండేయ జయంతి వేడుకలు  

– అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతినిధులు
నవతెలంగాణ – తాడ్వాయి 
మండలం కృష్ణాజివాడి గ్రామంలో మంగళవారం శ్రీ మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయ సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి విశేష కృషి చేశారని తెలిపారు. అనంతరం మార్కండేయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆలయ కమిటీ అధ్యక్షులు జగదీశ్వర్ తాడువాయి మండల పద్మశాలి అధ్యక్షులు గుజరాజు,పాగల సాయిబాబా, గద్దె రాజు బండమీది అరవింద్ ,కృష్ణమూర్తి, సిరిసిల్ల రాజు  గుజ్జ జగన్, మెరుగు స్వామి సాయిలు, పరంధాములు ఆడెపు ప్రసాద్ అల్లే శీను, ఇతరులు పాల్గొన్నారు.