
మతం కన్నా భక్తి నమ్మకం గొప్పదని టేక్మాల్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు మహమ్మద్ మతిన్ నిరూపించారు. మతిన్ పుట్టుకతో ముస్లిం యువకుడు ఆచార వ్యవహారాలను ముస్లిం సాంప్రదాయ ప్రకారమే పాటించే నికాసేన ముస్లిం. కానీ 2008 సంవత్సరంలో వినాయకుని లడ్డు వేలంపాటలో మొదటిసారిగా 5500కు నుగోలు చేశానని ఆయన అన్నారు. గణపతి చేతిలోని లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న నాటి నడి అదృష్టం కలిసి వచ్చింది అన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆశిస్తున్నాను అన్నారు. 2008 సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం లడ్డూను కొనుగోలు చేస్తూ 2024 సంవత్సరం లో వేలంపాటలో 60 వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నానన్నారు. బంధువులు కుటుంబ సభ్యులు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి, ముందుకు నడిపిస్తున్నారు . ముస్లిం మతానికి చెందిన నేను హిందూమతమైన గణపతి విగ్రహంలోని లడ్డూను కొనుగోలు చేయడం అందరూ ఆశ్చర్యం చూసినప్పటికిని, తనకు కలిసి వచ్చింది అన్నారు. నేను బతికున్నంత వరకు లడ్డూను కొంటూనే ఉంటాను నా పిల్లలకు సైతం ఈ ఆనవాయితీ నేర్పుతాను అని చెప్పారు.