ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ‘భామా కలాపం 2’ నిర్మించారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అభిమన్యు తడిమేటి దర్శకుడు. ఈనెల 16న ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ, ‘ఇందులో అన్నీ డబుల్ ఉంటాయి. ఎక్కువ థ్రిల్స్, ట్విస్ట్‌లుంటాయి. అంతే కాకుండా ఈసారి కాస్త డేంజరస్‌గా కూడా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమాను చూడాలి. మా దర్శకుడు అభిమన్యుతో రెండో సినిమా చేస్తున్నాను. శిల్ప, అనుపమ పాత్రలు ఇలానే కంటిన్యూ అవ్వాలి. రెండో పార్ట్‌లో కొన్ని పాత్రలను యాడ్ చేశాం. సీరత్ కపూర్ పాత్ర బాగుంటుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హౌస్ వైఫ్ అంటే అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. మహిళ తలుచుకుంటే ఏమైనా సాధించగలదని చూపించే ప్రయత్నమిది’ అని తెలిపారు. ‘మా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. మొదటి పార్ట్ చూసి, రెండో పార్ట్ చూస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. సీరత్ పోషించిన పాత్రతోనే ఎక్కువగా ట్విస్టులు వస్తాయి’ అని దర్శకుడు అభిమన్యు అన్నారు. సీరత్ కపూర్ మాట్లాడుతూ, ‘మొదటి సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. ప్రియమణి, శరణ్యతో నటించడం ఆనందంగా ఉంది. జుబేదా పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు అభిమన్యుకు థ్యాంక్స్’ అని చెప్పారు.