నవ తెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల గ్రామంలో శ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సర్పంచ్ కనకటి సునీత వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ కనకటి పల్ల వెంకన్నల ఆధ్వర్యంలో శుక్రవారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆండాలమ్మవారికి ,శ్రీకృష్ణ పరమాత్మునికి 108 గంగాల పాత్రలలో పాయసాన్ని నివేదించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై సేవా కాలం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కి పరమేష్, ఉపసర్పంచ్ మన్యం రమేష్,బి అర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దింటి మధు, నాయకులు మన్యం శంకర్, జగిని సోమన్న, శ్రీకాంత్, శ్రావణ్, నగేష్,నరేష్, సైదులు,రమేష్,భక్తులు, పురోహితులు హైగ్రీవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.