డైమ్లర్‌ నుంచి భారత్‌ బెంజ్‌ టార్క్‌షిప్ట్‌ టిప్పర్లు

న్యూఢిల్లీ : డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ (డిఐసివి)కి చెందిన సడ్సీడరీ డైమ్లర్‌ ట్రక్‌ ఎజి కొత్తగా భారత్‌ బెంజ్‌ హెవీ డ్యూటీ ట్రక్‌ శ్రేణీలో టార్క్‌షిప్ట్‌ టిప్పర్లను ఆవిష్కరించినట్టు తెలిపింది. ఇవి 12స్పీడ్‌ ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఎఎంటి) సామర్థ్యంతో రూపొందించబడ్డాయని పేర్కొంది. గనుల తవ్వకం కోసం భారీ ఆర్డర్‌ గెలుచుకున్నట్లు తెలిపింది.3532సిఎం మైనింగ్‌ ట్రిప్పర్లకు సంబంధించి 80 యూనిట్ల తొలి ఆర్డర్‌ దక్కినట్లు వెల్లడించింది.