కోల్‌కతా : రెండు రోజుల విరామం తరువాత భారత్ జోడో న్యారుయాత్ర ఆదివారం పున్ణప్రారంభమయింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పయిగురి వద్ద యాత్రను రాహుల్‌గాంధీ ఆదివారం పున్ణప్రారంభించారు. తరువాత ఇక్కడ నుంచి సిలిగురికి యాత్ర చేరుకుంది. సిలిగురి వద్ద బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘విద్వేషానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడ్డం పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఐక్యంగా నిలబడాలి. దేశానికి బెంగాల్ మార్గం చూపాలి’ అని తెలిపారు. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు భారత్ జోడో న్యారు యాత్రకు విరామం ఇచ్చారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహర్‌ల్లో 12 రోజుల పాటు నిర్విరామంగా సాగిన యాత్రకు ఈ నెల 25 మధ్నాహ్నాం నుంచి విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.