
జ్యోతిభా పూలే 198 వ జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లోని జ్యోతిభా పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు గురువారం అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 170 సంవత్సరాల కింద నే అనేక పాఠశాలలు స్థాపించి బహుజనుల అభివృద్ధికి మరియు వారిని చైతన్యం చేశారన్నారు. అలాంటి సంఘ సంస్కర్త కు భారత రత్న అవార్డు తో భారత ప్రభుత్వం సత్కరించాలన్నారు.బిసి కుల గణన చేపట్టి వెంటనే దామాషా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు పెంచాలన్నారు. బిసి లకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు రవికుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి రాజు, గౌరవ సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, డిచ్ పల్లి మండలం అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.