భారతరత్న పురస్కారాలు ప్రదానం

Bharat Ratna Awarding of awards– మాజీ ప్రధాని పీవీతో పాటు మరో ముగ్గురికి
– అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి భారత రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. శనివారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు అందజేశారు. మొత్తం ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారత రత్నలు ప్రకటించగా.. బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌ రావు భారత రత్న పురస్కారం అందుకున్నారు. అలాగే చౌదరి చరణ్‌ సింగ్‌ తరపున ఆయన కుమారుడు జైన్‌ చౌదరి, మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌.స్వామినాథన్‌ తరపున ఆమె కుమార్తె డాక్టర్‌ నిత్య పురస్కారాలు అందుకున్నారు. వెళ్లి ప్రధాని మోడీ, హౌమంత్రి అమిత్‌ షా అద్వానీ నివాసానికి వెళ్లి అద్వానీని సన్మానించనున్నారు. నలుగురికి మరణాంతరం ఈ పురస్కారాలు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌ సింగ్‌తో పాటు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హౌమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు హాజరయ్యారు.