ఘనంగా భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పూర్ణాహుతి…

– హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళ  సై సౌందర్య రాజన్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
భాగ్యనగరంలోని సీతారాం భాగ్ లో ఉన్న పురాతన శ్రీరామ మందిరంలో 45 రోజుల పాటూ నిర్వహించిన భారత భాగ్య సమృద్ది యజ్ఞం యొక్క పూర్ణాహుతి కార్యక్రమానికిముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్య రాజన్ హాజరై మాట్లాడుతూ.. చిన్నారులకు ఆద్యాత్మికత మార్గం చూపించాల్సిన అవసరం ఉంది అన్నారు. భారత భాగ్య సమృద్ది యజ్ఞ నిర్వహణ ఎంతో మహత్తర కార్యంచేపట్టినమాధవిలతనుఅభినందించారు.భాగ్యనగరంలోని సీతారాం భాగ్ లో ఉన్న ప్రాచీన శ్రీరామ మందిరంలో  ఆక్టోబర్ 15 నుండి 27 నవంబర్  వరకూ 45 రోజుల పాటూ నిర్వహించిన భారత భాగ్య సమృద్ది యజ్ఞం సోమవారం ముగిసింది. 45 రోజుల పాటూ నిర్వహించబడిన ఈ మహత్తర యజ్ఞ సందర్శన సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని శివున్ని ప్రార్థిస్తున్నట్లు, ఈ సందర్భంగా యాగ నిర్వాహకురాలు  మాధవి లత చెప్పారు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో యాగ నిర్వాహకులు  మాధవి లత కొంపెల్ల, ఛైర్మన్, లోపముద్ర ఛారిటబులే ఫౌండేషన్ తో పాటూ నిర్వాహక మండలి సభ్యులు యమన్ సింగ్,  ప్రమోద్ కుమార్, ఆర్ యల్ యన్ రావు, పలువురు కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.