భరతనాట్యం హిట్‌ ఖాయం

భరతనాట్యం హిట్‌ ఖాయంసూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్‌ కెవిఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్‌ ఫిలింస్‌ పతాకంపై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేకర్స్‌ శనివారం థియేట్రికల్‌ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ,’సూర్యకి బెస్ట్‌ డెబ్యు దొరికింది. దానికి కారణం సూర్యకి బెస్ట్‌ డాడ్‌ ధని ఉన్నారు. దాని వలనే బెస్ట్‌ కంటెంట్‌, బెస్ట్‌ సపోర్ట్‌ దొరికింది. భరతనాట్యం క్రైమ్‌ కామెడీ. ఇది సక్సెస్‌ ఫుల్‌ జోనర్‌. ఇంత మంచి ఎంటర్‌టైనర్‌ ద్వారా తను పరిచయం కావడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌లో హిట్‌ కళ కనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘కంటెంట్‌ నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర చాలా అద్భుతమైన చిత్రాన్ని అందించారు. ట్రైలర్‌లో ఉండే ఎనర్జీ థియేటర్స్‌లో ఉంటుంది’ అని హీరో సూర్య తేజ ఏలే చెప్పారు. దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ,”దొరసాని’ చిత్రానికి భిన్నంగా చేసే అవకాశం ఈ సినిమాతో దొరికింది. దాన్ని ఒక సవాల్‌గా తీసుకొని ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇందులో చాలా మంచి డ్రామా ఉంటుంది. కథలో చాలా బలం ఉంది. ఇందులో ఉండే పాత్రలన్నీ కొత్తగా ఉంటాయి. అలాగే ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. నలబై నిమిషాల పాటు కడుపుబ్బానవ్వించే సీక్వెన్స్‌లు ఉన్నాయి’ అని అన్నారు.