భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు 158% వృద్థి

న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ లాభాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 158 శాతం వృద్థితో రూ.4,159 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,612 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో ప్రతీ వినియోగదారుడి నుంచి సగటు రాబడి (ఎఆర్‌పియు) 5.5 శాతం పెరిగి రూ.211కు చేరింది. కంపెనీ రెవెన్యూ 10.1 శాతం పెరిగి రూ.29,046 కోట్లుగా చోటు చేసుకుంది.