ప్రచార కమిటీ సభ్యురాలు గా భారతి…

నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటి సభ్యురాలిగా స్థానిక ఎం.పి.టి.సి 1 సభ్యురాలు వేముల భారతి  నియమితులయ్యారు– పార్టీ ఆదేశానుసారం విజయానికి కృషి…
నవతెలంగాణ – అశ్వారావుపేట 
నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటి సభ్యురాలిగా స్థానిక ఎం.పి.టి.సి 1 సభ్యురాలు వేముల భారతి  నియమితులయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ కమిటీలు, వాటి పర్యవేక్షణ విభాగంలో నియోజకవర్గ వ్యాప్తంగా అధిష్ఠానం చే ఖరారు చేసిన ఎమ్మేల్యే అభ్యర్ధి తో పాటు ప్రచారంలో పాల్గొనే  అవకాశాన్ని మహిళా కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు నేతృత్వంలో అప్పగించారు. ఈ మేరకు ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గం ప్రచార బాధ్యత లు వేముల భారతికి అప్పగిస్తూ రాతపూర్వక వర్తమానం అందినట్లు భారతి ప్రకటించారు.పార్టీ పట్ల మాకు ఉండే విశ్వాసం నమ్మి తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీ ని అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆమె అన్నారు.