ప్రతిభ కనబరిచిన భారతి నృత్యానికేతన్ విద్యార్థులు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని భారతి నృత్యానికేతన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ప్రశంసలు పొందినట్లు నాట్య గురువు సరోజ సుధీర్ మంగళవారం తెలిపారు. ఇటీవల సిద్ధ నాట్య కళ సమితి ఆధ్వర్యంలో నాదం -2  ద్వారా శ్రీ రామదాసు కీర్తనలు తీసుకొని అయోధ్య రామయ్య కు నవరత్న మాలిక అనే థీమ్ తో ఉప్పల్ శిల్ప కళ వేదిక ద్వారా ప్రదర్శన ఇవ్వడం జరిగింది అని తెలిపారు. వివిధ కళ సంస్థలతో పాటు గా. గురువుల ప్రదర్శన ప్రత్యేకంగా నిలించింది అని అన్నారు.