హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆ సంఘం జాతీయ జీవితకాల అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రజాభవనలో భట్టిని మర్యాదపూర్వకంగా కలిసి, పోటీల వివరాలను తెలియజేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక పోటీలు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ సహకారం కావాలని భట్టిని లక్ష్మణ్ రెడ్డి కోరారు. ఈ పోటీలు ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. 20 రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.