– డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ శ్రేణుల భారీ స్వాగతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల జార్ఖండ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడుతూ…అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇండియా కూటమి ఘన విజయానికి బలమైన పునాదులేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులు సంబరోత్సాహాలతో స్వాగతం పలికారు. జార్ఖండ్‌లో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శనివారం రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మెన్ పోడెం వీరయ్య, కార్పొరేషన్ చైర్మెన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు, వివిధ జిల్లాల, మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.