భువనేశ్వర్‌కు వెళ్లిన భట్టి

భువనేశ్వర్‌కు వెళ్లిన భట్టినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఒడిశా రాష్ట్రం కటక్‌లో అదివారం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. అంతకు ముందు సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించన ఆయన…అనంతరం రాహుల్‌గాం ధీతోపాటు బహిరంగసభలో ప్రసంగించారు. అక్కడి పీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ అజరు కుమార్‌, జాతీయ నేత భక్త చరందాస్‌, ఆర్‌సీ కుంతియాలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ తర్వాత భువనేశ్వర్‌ పీసీసీ సోషల్‌ మీడియా విభాగం నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు. ప్రీ కాస్ట్‌ టెక్నాలజీతో నిర్మించిన ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.