
జక్రాన్ పల్లి మండలం లోని కలిగోట్ గ్రామానికి చెందిన ఆకుల భవ్య శ్రీ అండర్ 19 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు కలిగోట్ సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి తెలిపారు .ఈనెల 29 నుండి ఫిబ్రవరి 1 వరకు నెహ్రు స్టేడియం శివమొగ్గ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో జరిగే వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు .ఈ సందర్భంగా క్రీడాకారిణి ని ఉప సర్పంచ్ నాయిక రాజు, ఎంపీటీసీ జయ గిరిధర్ గౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ సత్యనారాయణ గ్రామ కమిటీ సభ్యులు, వ్యాయమ ఉపాధ్యాయుడు యాదగిరి, మరియు గ్రామ ప్రజలు అభినందించారు.