అంగన్వాడీ కేంద్రం లో భేటీ బచావో భేటీ పడావో

నవతెలంగాణ – పెద్దవూర
అంగన్‌వాడీలే కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని అనుముల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మంగళవారం మండలం లోని చలకుర్తి సెక్టారు పరిధిలోని తుంగతుర్తి అంగన్‌వాడీ కేంద్రంలో భేటీ బచావో, భేటీ పడావో,పోషణ పట్వాడ, పోషణమాసం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సూపర్ వైజర్ మాట్లాడుతూ.. గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక నియమాలను గురించి వివరించారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ మేరకు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్, రమణ, ఏఎన్ఎం లు సైదమ్మ, సత్యమ్మ, గర్భినులు బాలింతలు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.