అంగన్వాడీ కేంద్రం లో ఘనంగా భేటీ బచావో భేటీ పాడావో

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని చలకుర్తి అంగన్వాడీ కేంద్రం లో 2వ సెంటర్ లో శనివారం అనుముల శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ అధికారి గంధం పద్మావతి అధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి అంగన్వాడీ చలకుర్తి సెక్టారు సూపర్ వైజర్ గౌసియా బేగం అంగన్వాడీ టీచర్ ముఖ్య శాంతమ్మ గ్రామం లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీడీపీఓ మాట్లాడారు. బాలల హక్కులు, ముఖ్యంగా బాలిక సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న పతకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు.వారి రక్షణ కోసం,  అభివృది కోసం తీసుకుంటున్న చర్యలను, వాటి పరిరక్షణ చట్టలైన పోక్సో 2012 చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ, బాల్య వివాహాల నిరోధ చట్టం 2006, వంటి వాటి పైన అవగాహన కల్పించామని తెలిపారు. బాలల కు ఏదైనా ఆపద ఉంటే 1098,100 ,181 ఉచిత టోల్ ఫ్రీ నంబరను ఉపయోగించుకోవాలని అని అన్నారు. అనంపురం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా పద్మ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నజీరుద్దిన్, శ్రీదేవి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.