బెట్టేల తండాలో ఘనంగా భేటీ బచావో, భేటీ పడావో

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోని బెట్టేలా తండాలో బుధవారం భేటీ బచావో భేటీ పాడావో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా అనుముల ఐసిడిఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం  బాల్య వివాహాల పై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అంగన్వాడీ లబ్ధిదారులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని తెలిపారు. ప్రతి రోజు గుడ్లు, పాలు, మధ్యాహన్నాం రుచికరమైన భోజనం అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తునామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరోజ,ఆయా సుజాత, లబ్ధిదారులు సంతోషి, సోనా, పార్వతి, లక్ష్మి, వరాలు, లాలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.