మహిళ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని, భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్పోర్ట్స్ గ్రౌండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థినిలచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్ భవనములో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా అర్బన్ ఎమ్మెల్యే సూర్య నారాయణ ధనపాల్ గుప్తా పాల్గొనీ ఆడపిల్లలు మహిళలు అంటే గతం లో చిన్న చూపు చూసే వారని ప్రస్తుతం ప్రభుత్వాలు ఆడపిల్లలు మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రారంభించడం వల్ల అంట్లు తోమే స్థాయి నుండి అంతరిక్షానికి వెళ్ళే స్థాయి వరకు ఎదిగారని,బాల్య వివాహాలు అరికట్టడం లో ఇంకా ఎక్కువ సమన్వయం తో పని చేయాలని అన్నారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యుల సహాకారం చాలా అవసరం అని అన్నారు మహిళా కమిషన్ మెంబర్ సుదాం లక్ష్మీ మాట్లాడుతూ.. పిల్లలకు ఫోన్ లు దూరముగా పెట్టాలని అన్నారు ,జిల్లా సంక్షేమ అధికారి యస్ కే రసూల్ బి మాట్లాడుతూ.. యునిసెఫ్ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 40% పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని , 15 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 12 % పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని 25 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 30% మాత్రమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని దీనిని పెంచాలని అన్నారు. డి యం అండ్ హెచ్ వో రాజశ్రీ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖా వారి ఆద్వర్యములో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమములో అల్ ఇండియా రేడియొ డి డి మోహన్ దాస్ , జి ఈ సి ఓ భాగ్యలక్ష్మి, డి ఎం సి మాధవి సి డి పి వో లు, సూపర్ వైజర్, వెంకటేశ్వర్ హెల్త్ డిపార్ట్మెంట్,లు డి హెచ్ ఈ డబ్ల్యూ డీఎంసీ స్వప్న, సౌమ్య, పుష్ప, కవిత, ఆదిత్య, ఉదయ్ అదేవిధంగా డిసిపిఓ చైతన్య ఐ సి పి యస సిబ్బంది, సఖి, పోషణ్ అభియాన్ వారు పాల్గొన్నారు. కార్యక్రమము ప్రారంభములో జెడ్ పి హెచ్ సి, మల్లారం, మానవతా సదన్, విజయ్ పబ్లిక్ స్కూల్, మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినిలు ఆడపిల్లల, మహిళల పై జరుగుతున్న అత్యాచారాలపై అన్యాయాలపై చేసిన సాంసృతిక కార్యక్రమాలు ఆకర్షణ గా కనువిందు చేశాయి.
భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభం ..
నవతెలంగాణ – కంఠేశ్వర్