పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 27న అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఓ వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. ఈ విషయం తెలుసుకున్న కాలనీకి చెందిన బీజేపీ నాయకులు భీంసేనా రెడ్డి బాధితులు సాయికిరణ్ కు రూ. పది వేల విలువగల నిత్యావసర సరకులను గురువారం అందించి ఉదారత చాటుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోడానికి స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు భీంసేన్ రెడ్డి కోరారు. అంతకుముందు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవి, విక్రం, జగదీష్, అశోక్, సంతోష్ పాల్గొన్నారు.