నవతెలంగాణ తుంగతుర్తి:
ఆర్థిక వ్యవస్థలో భీమా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రతను సాధించేందుకు ఉపయోగించే సాధనం భీమా అని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఏజీఎం సురేష్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన ఐతగాని సైదులు అకాల మరణం సందర్భంగా అతని భార్య ఐతగాని మాధవికి 7,82,643 రూపాయల చెక్కును అందజేసి మాట్లాడారు. కుటుంబంలో ఆదాయాన్ని అర్జించే కుటుంబ యజమాని అకాల మరణం జరిగితే నష్టభయం నుంచి భద్రత కల్పించడానికి ఉద్దేశించినదే జీవిత బీమా సంస్థ అని అన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామీణ మార్కెట్లో భీమాను అందిస్తుందని ఇది సమాజంలోని సామాన్య ప్రజానీకానికి ఆర్థికంగా బలహీన వర్గాల భీమా అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వివిధ రకాల భీమ పథకాలను కలిగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం చిరంజీవి మేనేజర్ భరత్ కుమార్ డివోలు తోట్ల సుధాకర్ మంజుల, వీరాంజనేయులు, రాజు యాదవ్, నాగేశ్వరరావు, ఎస్ఓలు మధు, రాజు, శ్రీనివాస చారి, లింగమూర్తి, నరేష్, వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.