మండల నాగులమ్మ హమాలీ సంఘం నూతన అధ్యక్షునిగా ఎడ్లపల్లి గ్రామానికి చెందిన రౌతు భీమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సోమవారం మండలంలోని నాగులమ్మ దేవాలయం ఆవరణలో మండలంలోని అన్ని గ్రామాల హమాలీలు కలిసి ఈ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా గుగులోతు బలరాంనాయక్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల మల్లయ్య, సహాయ కార్యదర్శిగా గుంటి రమేష్, కోశాధికారిగా గుంటుకు సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా గొట్టం శ్రీనివాస్, బుర్ర సతీష్ ఎన్నికయ్యారు. ఈనెల 17 కొయ్యూరులో హమాలీ సమస్యలపై జరిగే జ సమావేశానికి మండల హమాలీలు అందరూ హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బీమయ్య కోరారు.