నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన భీమనపల్లి సైదులు ను గురువారం మండలంలోని పిఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మండల సీనియర్ నాయకులు నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా ఆయన కిష్టాపురం ఎంపిటిసి భీమనపల్లి సైదులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా లక్ష్యంగా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోనులో ఇచ్చిన ఆరు గ్యారంటీలను మునుగోడు మండలంలోని ప్రతి గడప గడపకు తెలిసే విధంగా కార్యకర్తలతో వెళ్లి ప్రచారం చేస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు . తమ నియామకానికి సహకరించిన మండల , జిల్లా నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు.