నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ కమిషనరేట్లోని భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్పై బదిలీ వేటు పడింది. సర్కిల్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భీంగల్ పరిధిలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధూ శర్మ విచారణ జరిపించినట్లు సమాచారం. అందులో భాగంగా ముందుగా భీంగల్ సీ. ఐ నవీన్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. సంబందిత విచారణ నివేధికను మల్టీ జోన్ 1 ఐజికి రిపోర్టు చేశారు. ఐజీ సిఐపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భీంగల్ సీ ఐ నవీన్, ఎస్సై మహేష్ ల పై వచ్చిన అవినీతి ఆక్రమాల విచారణ అనంతరం ఎస్సై పై కూడా వేటు పడడం ఖాయమని తెలుస్తోంది.