భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌

భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌క్రిస్పి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో కారుణ్య శ్రేయాన్స్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో ఊర శ్రీనివాస్‌ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. యస్వంత్‌, సాయితేజ, అరుషి, నిఖిల హీరో, హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం ఫిలించాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్‌ ఛానల్‌ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌ కొట్టారు, రచయిత బిక్కి కష్ణ స్విచ్‌ ఆన్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ బిక్కి కష్ణ మాట్లాడుతూ,’సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉండటం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని నిర్మాత పోతురాజు నర్సింహారావు చెప్పారు. డైరెక్టర్‌ ఊర శ్రీనివాస్‌ మాట్లాడుతూ,’మా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్‌ అవుతుంది’ అని అన్నారు.