జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవం 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భీష్మ ఏకాదశి పురస్కరించుకొని అర్సపల్లి మత్స్య శాఖ ఎఫ్ డి ఓ కార్యాలయము లో నిజామాబాద్ జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవాన్ని గంగ పుత్రులు నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల మండలాల అధ్యక్షులు కార్యదర్శులు గంగపుత్రులు జిల్లా స్థాయిలో  భీష్మ ఏకాదశి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు, ఎఫ్ డి ఓ జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుంగిని సాయిలు లీగల్ అడ్వైజర్ రవి, ప్రధాన కార్యదర్శి బాలగంగాధర్, ఉపాధ్యక్షులు మీసాల రవి, ప్రచార కార్యదర్శులు ఎల్ఐ సీ శ్రీనివాస్ కుమార్ డాక్టర్ మంగల్పాటి లింగం, గౌరవ అధ్యక్షులు కమ్మర్పల్లి బాలన్న, పల్లికొండ నరసన్న, ముఖ్య సలహాదారులు రెంజల్ ప్రెసిడెంట్ శంకర్, రమడోల్ల పోతన్న, ప్రమోటర్ సురకత్తుల పెద్దన్న డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్,  సంయుక్త కార్యదర్శి మద్ది రాజు నవీపేట మండల ప్రెసిడెంట్ చెట్టుకింద నారాయణ వివిధ గ్రామాల నుండి వచ్చిన గంగపుత్ర సంఘాలు పాల్గొన్నారు.