భోగ భాగ్యాలు భోగీ..

– కోడిపందాల జోరు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రం అయిన మూడురోజుల పర్వదినం సంక్రాంతి మొదటి రోజు భోగి వేడుకలను ఆదివారం మండల వ్యాప్తంగా నిర్వహించుకున్నారు. తెల్లవారు జామునే కుటుంబం అందరూ లేచి ఇంట్లోని పాత వస్తువులను ఒక్కచోట వేసి ఆవు పిడకలతో భోగి మంటలు ఏర్పాటు చేశారు. భోగి మంటల చుట్టూ చిన్నారులు,పెద్దలు సందడి చేస్తూ కనిపించారు. భోగి మంటల వేడితో నీటిని కాచి ఆ నీటితో చిన్నారులకు భోగి పండ్లతో తల స్నానాలు చేసి నూతన వస్త్రాలను దరించారు.ఇంటి ఎదుట సంక్రాంతి ముగ్గులతో అలరించారు.అశ్వారావుపేట ఆంధ్రా సరిహద్దు కావడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వేలల్లో పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ లోని కోడిపందాల స్థావరాల వద్ద దర్శనమిచ్చారు.వ్యవసాయ క్షేత్రాల్లో,కాళీ ప్రదేశాలలో జరగిన కోడిపందాలు లో మొదటి రోజు లక్షల్లో ధనం చేతులు మారింది.కాయ్ రాజా కాయ్ అంటూ బిర్లు వద్ద సందడి నెలకొన్నది. ముఖ్యంగా అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం నుండే కాక ఇతర జిల్లాల నుండి అశ్వారావుపేట సరిహద్దు ఆంధ్రా గ్రామాలలో నిర్వహిస్తున్న కోడి పందాలకు తరలి వెళ్ళారు.రాత్రి విద్యుత్ కాంతుల మద్య జరిగిన పందాలను సైతం వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. మూడు రోజులు పాటు జరిగే కోడి పందాలను తిలకించేందుకు మహిళలు,రాజకీయ నాయకులు సైతం ఆత్రుత కనబర్చారు.తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగకు ఆనవాయితీగా మారిన కోడిపందాలు వీక్షించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వేలల్లో పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ లోని కోడిపందాల స్థావరాల వద్ద దర్శనమిచ్చారు. వ్యవసాయ క్షేత్రాలు,రహస్య పచ్చిక బైల్ల ల్లో జరుగు తన్న కోడిపందాలు లో మొదటి రోజు ఆదివారం లక్షల్లో ధనం చేతులు మారింది. ఈ కాయ్ రాజా కాయ్ అంటూ బిర్లు వద్ద సందడి నెలకున్నది.ముఖ్యంగా అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం నుండే కాక ఇతర జిల్లాల నుండి అశ్వారావుపేట సరిహద్దు ఆంధ్రా గ్రామాలలో నిర్వహిస్తున్న కోడి పందాలకు తరలి వెళ్ళారు.