
నవతెలంగాణ – నెల్లికుదురు
సీపీఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ భోగ శ్రీరాములు 21 వర్ధంతి సభను ఘనంగా నిర్వహించినట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఆలకుంట్ల సాయన్న తెలిపారు. మండల కేంద్రంలో సీపీఐ ఎమ్మెల్ భోగ శ్రీరాములు 21వ వర్ధంతి సభను గజ్జల వీరన్న అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు జాటోత్ బిక్షపతి, గ్రామ కమిటీ నాయకులు నాగవెల్లి సంజీవ రాములు రాజు తదితరులు పాల్గొన్నారు.