– నాకు చాలా ప్రత్యేకమైన సినిమా
– చిరంజీవి నటిస్తున్న మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్
‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ తమన్నా మీడియాతో ముచ్చటించారు.
‘ఈనెల 10న రజనీకాంత్‌తో చేసిన ‘జైలర్’, 11న చిరంజీవితో చేసిన ఈ సినిమా.. ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, రజనీకాంత్.. ఇండిస్టీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లయింది. ‘సైరా’లో చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. కానీ ఈ సినిమాలో ఆయనతో ‘మిల్కీ బ్యూటీ..’ పాటలో నటించా. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ‘వేదాళం’కు ఈ సినిమా రీమేక్. అయితే మెహర్ రమేష్ చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా ఉంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్‌లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియో పరంగా జైలర్‌లో కావలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్‌లో నాది ఫుల్ లెంత్ రోల్. ‘కాళిదాస్’ తర్వాత సుశాంత్‌తో మళ్ళీ వర్క్ చేయటం చాలా
ఆనందంగా ఉంది. ఇందులో చాలా డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తాం. ఎలా అంటే, ‘కాళిదాస్’లో ప్రేమికులుగా కనిపిస్తే, ఇందులో అక్కా, తమ్ముళ్లుగా కనిపిస్తాం (నవ్వుతూ). కీర్తి సురేష్‌తో కాంబినేషన్ సీన్స్ చేయడం చాలా ఎంజారు చేశాను. తను ఇంటెన్స్ సీన్స్‌తో పాటు అన్నీ ఎమోషన్స్‌ని సెటిల్డ్ అండ్ బ్యాలెన్స్‌గా చేేస్తుంది. ఇందులో అన్నీ ఎలిమెంట్స్ ఉండే కమర్షియల్ సినిమా ఇది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ‘మిల్కీ బ్యూటీ, జామ్ జామ్..’ పాటలు నాకు చాలా నచ్చాయి. ‘జామ్ జామ్’ పాటలో నర్సపల్లి అనే ట్విస్ట్ పెట్టడం పార్టీ సాంగ్‌కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మాతలు సినిమాల పట్ల చాలా ప్యాషన్‌తో ఉంటారు. ఈ సంస్థలో గతంలో కూడా పని చేశాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం ఈ నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్రస్తుతం తమిళంలో ‘అరణం’ సినిమా, మలయాళంలో ‘బాంద్ర’ సినిమా చేశాను. అలాగే హాట్ స్టార్‌లో ఓ వెబ్ సిరీస్ చేేస్తున్నా. ఎప్పటికప్పుడు భిన్న పాత్రలతో అలరించాలనేది నా తపన. అందుకే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’ అని చెప్పారు.