పరారీలో భూ బకాసురులు

– భూమి రేట్లు పెరగడంతో అక్రమాలకు పాల్పడుతున్న రియల్టర్స్‌
– గాలింపు చర్యల్లో నిమగమైన ఆదిభట్ల పోలీస్‌లు
నవతెలంగాణ – ఆదిభట్ల
గతవారం భూ కబ్జా వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత కన్నారావు అనుచరులు అరెస్ట్‌ అయినప్పటికీ ఏ 4 నిందితుడు కన్నారావు పరారీలో ఉన్నాడు. వివారల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నే గూడకు చెందిన సర్వే నంబర్‌ 32లో 2 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. అదే గ్రామానికి చెం దిన జకిడి సురేందర్‌ రెడ్డి 2013లో చావా సురేష్‌కి అగ్రిమెంట్‌ ఆఫ్‌సేల్‌ కం జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేశాడు. తరువాత సురేష్‌ సేల్‌ డీడ్‌ చేసుకొని 20 20లో ఓఎస్‌ఆర్‌ సంస్థకు విక్రయించారు. అనం తరం 2023 లో ఓఎస్‌ఆర్‌ వారు ఎస్‌ఎస్‌ఏ హెన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు రిజిస్ట్రేషన్‌ చేయగా వాళ్ళు పొ లం చుట్టూ హద్దు రాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రహ రీ నిర్మించారు. భూమి రేట్లు పెరగడంతో విష యం తెలుసుకున్న జకిడి సురేందర్‌ రెడ్డి తమ భూ మి కబ్జా అయిందని తిరిగి అప్పగిస్తే రూ.2 కోట్లపై గా ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేత కన్నారావ్‌తో ఒప్పం దం కుదుర్చుకున్నారు. దీంతో ఈ నెల 3వ తేదీన కన్నారావ్‌ తన అనుచ రులతో భూమిలోకి వెళ్ళి గోడలు ధ్వంసం చేసి బీభత్సం చేశా రు. విషయం తెలు సుకున్న ఓఎస్‌ఆర్‌ సంస్థ యజమాని శ్రీని వాస్‌ ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్‌లు కన్నారావుతో పాటు 35 మందిపై కేసు నమోదు చేసి ఐదుగు రిని అరెస్ట్‌ చేసి చంచల్‌ గూడ జైల్‌కి పంపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు ఆదిభట్ల పోలీస్‌ లు తెలిపారు.