నీళ్ల ఐలయ్య కాదు.. భూదందాల ఐలయ్య: గొంగిడి మహేందర్ రెడ్డి 

Not the Ailaiah of Neela.. The Ailaiah of Bhudanda: Gongidi Mahender Reddy– ప్రతి గ్రామానికి కేసీఆర్ నీళ్లే వస్తున్నాయి 
– కెసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కావడం వల్లనే ఆలేరుకు సాగు, త్రాగునీళ్లు 
– భూదందాలు బందు పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టు
– తపస్ పల్లి నీళ్లపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి0
– ఎక్కడ కాల్వలతోవ్వి నీళ్లు తీసుకొచ్చావో ప్రజల సమక్షంలో తెలుసుకుందాం పదా: గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
నీళ్ల ఐలయ్య కాదు… భూదందాల ఐలయ్య… నువ్వు జీవితంలో నీళ్ల ఐలయ్యవు కాలేవు… ఎక్కడ నుంచి తెచ్చినావు నీళ్లు అని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్, వంగపల్లి పిఎసిఎస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం, యాదగిరిగుట్ట, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కావడం వల్లే అక్కడ ప్రాజెక్టులు కట్టడం వల్లే   ఆలేరు నియోజకవర్గానికి సాగు, త్రాగునీళ్లు వస్తున్నాయని అన్నారు. గోదావరి జలల మీద పోరాటం చేసిన ఒక సీనియర్ నాయకుడు ఆయన 15 సంవత్సరాల క్రితం రాసిన బుక్ లో చెప్పిన దాని ప్రకారం ఆలేరు నియోజకవర్గం సముద్ర మట్టం నుంచి 532 మీటర్ల ఎత్తులో ఉందని, ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు రావాలంటే మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నీళ్ల శాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి  అయితేనే ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు వస్తాయని తెలిపారని చెప్పారు.  మనకంటే ఎత్తులో మన పైన ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి, కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి,  ఎత్తిపోతల ద్వారా అక్కడ నీళ్లు తెచ్చుకుంటే అక్కడ నుంచి మనకు వస్తున్నాయని అన్నారు. కాలేశ్వరం, బ్యారేజీలు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్మించి డిస్ట్రిబ్యూటరీ కాలువలు 14, 15, 16 త్రవ్వి, కట్టడానికి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పట్టిందని, దీని ద్వారా ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
తపస్పల్లి నుంచి నీళ్ళు తెచ్చే దమ్ముందా..
తపస్పల్లి నుంచి నీళ్లు రెండు గ్రామాలకు వస్తాయని గతంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత బొందుగులకు నాలుగు పర్యాయాలు, కొలనుపాక గ్రామానికి రెండు పర్యాయాలు నీళ్లు తెచ్చారని, అక్కడ ఏ రైతును అడిగిన చెప్తారని, నీకు దమ్ము ధైర్యం ఉంటే కూరారం, జ్వాల, పాముకుంట, బూరుగుపల్లి, పారుపల్లి ఈ గ్రామాలలోకి తపాస్పల్లి నీళ్లు తీసుకురావాలని సవాలు విసిరారు. తపస్పల్లి నీళ్లపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి అని ధ్వజమెత్తారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొండపోచమ్మ ద్వారా బొమ్మలరామారంలో 15 గ్రామాలలో, తుర్కపల్లిలో 10 గ్రామాలలో, గుండాలలో 20 గ్రామాలకు 19 గ్రామాలలో చెరువులు నింపామని అన్నారు. ఎక్కడ కాల్వలతోవి నీళ్లు తీసుకొచ్చావో ప్రజల సమక్షంలో తెలుసుకుందాం పదా….. అని ధ్వజమెత్తారు.  బావి తవ్వడానికి నెల రెండు నెలలు పడుతుంది అని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ ద్వారా వచ్చిన కాల్వలే డిస్ట్రిబ్యూషన్ కాల్వలు అని, వాటి ద్వారానే చెరువులు నింపుతున్నారని, ఇవి కేసీఆర్ నీళ్లని అన్నారు. ప్రతి గ్రామానికి కేసీఆర్ నీళ్లు వస్తున్నాయని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో నీళ్లు వచ్చాయా అని ప్రశ్నించారు, నీళ్లు వస్తాయి అని ఎదురుచూసి ఎదురుచూసి ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. కెసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కావడం వల్లే ఆలేరు నియోజకవర్గానికి సాగునీళ్ళు, తాగునీళ్లు ఇప్పుడు వస్తున్నాయని దాంతో నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు కవిడే మహేందర్, బొట్ల యాదగిరి, బీసు చందర్ గౌడ్, గంగుల శ్రీనివాస్, సట్టు తిరుమలేష్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, మొగులగాని మల్లేష్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, గుట్ట కౌన్సిలర్లు బూడిద సురేందర్, ఆవుల మమత సాయి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్లెం స్వాతి, కోరె బిక్షపతి, ఎగ్గిడి కృష్ణ, తోటకూరి బీరయ్య, కల్వకొలను సతీష్ రాజ్, మిట్ట అనిల్, రేపాక స్వామి, దావూద్, దేవపూజ అశోక్ తదితరులున్నారు.